నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-12-01T14:04:29+05:30 IST

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. నోముల మరణం టీఆర్ఎస్‌కు, సాగర్ ప్రజలకు తీరని లోటని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2020-12-01T14:04:29+05:30 IST