ఆంధ్ర ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్

ABN , First Publish Date - 2020-12-20T14:55:56+05:30 IST

ఆంధ్ర ఆదర్శ రైతు ప్రసాదరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.

ఆంధ్ర ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్

హైదరాబాద్: ఆంధ్ర ఆదర్శ రైతు ప్రసాదరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెంకు చెందిన ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్... వెద పద్ధతిలో సాగు అంశాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రసాదరావు 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి..వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశారు. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 40- 45 బస్తాల దిగుబడి సాధించానని కేసీఆర్‌కు ప్రసాద్‌రావు తెలియజేశారు. ఈ సందర్భంగా త్వరలో కారు పంపిస్తానని.. ఒక పూట ఉండి బోజనం చేసి వెళ్లాలని..ప్రసాదరావుకు సీఎం కేసీఆర్ ఆహ్వానం అందించారు. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని ప్రసాదరావును  కేసీఆర్ కోరారు. 


Updated Date - 2020-12-20T14:55:56+05:30 IST