పాత బిల్లులు చెల్లించకుండా కొత్త పనులా..?
ABN , First Publish Date - 2020-05-19T10:59:33+05:30 IST
చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కొత్తపనులకు టెండర్లు పిలవడంపై జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపా రు.

జూన్ 1 నుంచి పనులు నిలిపివేస్తాం
జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల స్పష్టీకరణ
జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద నిరసన
ఎల్‌బీనగర్, మే 18(ఆంధ్రజ్యోతి): చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కొత్తపనులకు టెండర్లు పిలవడంపై జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపా రు. సోమవారం ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల ఎదుట జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇప్పటికే చేసిన పనులకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి బిల్లులు చెల్లించని కారణంగా జూన్ 1 నుంచి పనులను నిలిపేయాలని నిర్ణయించినట్లు జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ జోన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలిపారు.
జీహెచ్‌ఎంసీవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఎల్‌బీనగర్‌లో ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కొత్తగా రూ.22 కోట్ల పనులకు టెండర్లు పిలవడమేమిటని వారు ప్రశ్నించారు. ఒక్క ఎల్‌బీనగర్‌లోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.