బాలల హక్కులను పరిరక్షించాలి: డాక్టర్ ఆనంద్

ABN , First Publish Date - 2020-12-10T22:43:31+05:30 IST

బాలల హక్కులను పరిరక్షించాలి: డాక్టర్ ఆనంద్

బాలల హక్కులను పరిరక్షించాలి: డాక్టర్ ఆనంద్

హైదరాబాద్: బాలల హక్కులను పరిరక్షించాలని డాక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం (డిసెంబర్ 10) సందర్భంగా హైదరాబాద్ రాంపల్లి ప్రాంతంలోని డెస్టినీ ఫౌండేషన్ అనాథ ఆశ్రమంలో బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో ఈసీ గోపాల్ జన్మదిన వేడుకలు మరియు అన్న దాన కార్య క్రమాన్ని డాక్టర్ ఆనంద్, సుజాత, కిషన్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించడంతో పాటు బిస్కెట్స్, కేక్ పంచారు. 


అనాథ బాలలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. బాలల హక్కులను కాపాడి, వారి కోసం ప్రత్యేక రాజ్యాంగ సవరణలు చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.  అనాథలు, వృద్ధుల కొరకు ఎన్నో సహాయ శిబిరాలను నిర్వహించామని డాక్టర్ ఆనంద్ వెల్లడించారు.

Updated Date - 2020-12-10T22:43:31+05:30 IST