కొహెడ మార్కెట్ బాధితులకు చెక్కులు
ABN , First Publish Date - 2020-06-23T10:36:40+05:30 IST
కొహెడ మామిడి మార్కెట్‌లో నిర్మించిన తాత్కాలిక షెడ్లు ఈదురుగాలులకు కూలి గాయపడిన బాధితులకు మార్కెట్ కమిటీ

హయత్‌నగర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కొహెడ మామిడి మార్కెట్‌లో నిర్మించిన తాత్కాలిక షెడ్లు ఈదురుగాలులకు కూలి గాయపడిన బాధితులకు మార్కెట్ కమిటీ ఆర్థిక సహాయం అందించింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంనర్సింహగౌడ్, పాలకవర్గ సభ్యులు సోమవారం బాధితులకు ఆర్థిక సహాయం చెక్కులను అందించారు.
మామూలు గాయాలైన 31 మందికి రూ. 10 వేల చొప్పున, తీవ్రంగా గాయాలకు గురైన 19 మందికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మార్కె ట్ కమిటీ రూ. ఏడు లక్షల 85 వేలను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందాడి ముత్యంరెడ్డి, కొత్త కిషన్, మార్కెట్ అదనపు కార్యదర్శి చిలుక నర్సింహ్మరెడ్డి, కౌన్సిలర్‌లు బాల్‌రాజ్, ధన్‌రాజ్, శ్రీలత, కల్యాణ్‌నాయక్, సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, లావణ్య, బల్‌దేవ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.