పెళ్లి చేసుకుంటానని మోసం.. యువకుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-09-13T08:56:25+05:30 IST

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పెళ్లి చేసుకుంటానని మోసం.. యువకుడి అరెస్టు

మల్కాజిగిరి, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన భీమగోని చేతన్‌కుమార్‌గౌడ్‌(34)తో మల్కాజిగిరి గౌతంనగర్‌కు చెందిన యువతికి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఆగస్టు 13న నిశ్చితార్థం పెట్టుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. కట్నం కింద రూ.5లక్షలు ఇచ్చారు. కాగా నిశ్చితార్థానికి ఒక రోజు ముందు చేతన్‌కుమార్‌ మా బంధువులు మరణించారని, నిశ్చితార్థం వాయిదా వేయాలని యువతి తరఫు వారికి ఫోన్‌ చేశాడు. అప్పటి నుంచి మళ్లీ పెళ్లి విషయం మాట్లాడేందుకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించ లేదు. దీంతో యువతి తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చేతన్‌కుమార్‌గౌడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-09-13T08:56:25+05:30 IST