ఓ చానెల్‌ సీఈవో పీఏ అదృశ్యం

ABN , First Publish Date - 2020-09-05T08:21:47+05:30 IST

ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరిన ఓ చానెల్‌ సీఈవో పీఏ కనిపించకుండాపోయాడు

ఓ చానెల్‌ సీఈవో పీఏ అదృశ్యం

కూకట్‌పల్లి, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరిన ఓ చానెల్‌ సీఈవో పీఏ కనిపించకుండాపోయాడు. మూసాపేట ఆంజనేయనగర్‌లో నివసిస్తున్న ఎస్‌.సతీ్‌షకుమార్‌ ఓ చానెల్‌ సీఈవో పీఏగా పనిచేస్తున్నాడు. ఈనెల 2వ తేదీన విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆయన తన ఫోన్‌ ఇంట్లో వదిలేసి వెళ్లడంతో భార్య సరిత చానెల్‌ కార్యాలయానికి ఫోన్‌ చేశారు. సతీ్‌షకుమార్‌ ఆఫీసుకు రాలేదని వారు చెప్పారు. సతీ్‌షకుమార్‌ ఆచూకీ లభించకపోవడంతో సరిత కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2020-09-05T08:21:47+05:30 IST