ఘనంగా చందన బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-03T09:27:52+05:30 IST
వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న చందన బ్రదర్స్ జువెలరీ, టెక్స్‌టైల్ షోరూమ్ ప్రారంభోత్సవం శుక్రవారం సికింద్రాబాద్ ..

సికింద్రాబాద్, అక్టోబర్ 2(ఆంధ్రజ్యోతి): వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న చందన బ్రదర్స్ జువెలరీ, టెక్స్‌టైల్ షోరూమ్ ప్రారంభోత్సవం శుక్రవారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో ఘనంగా జరిగింది. సంప్రదాయ రీతిలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, శాసన మండలి సభ్యుడు రాంచందర్‌రావు, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణశ్రీనివా్‌సగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. షోరూమ్‌ను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, జువెలరీ విభాగాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఇతర విభాగాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, కార్పొరేటర్ అత్తెల్లి అరుణశ్రీనివా్‌సగౌడ్ ప్రారంభించారు. నిత్యం ప్రజా జీవితం, రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు షోరూమ్‌లోని వస్త్రాలు, ఆభరణాలను సందర్శించి, కాసేపు సరదాగా గడిపారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా బోణి కోసం షాపింగ్ కూ డా చేశారు. వస్త్ర, నగల ప్రపంచంలో తమ ప్రత్యేకతను కొనసాగించాలంటూ చం దన బ్రదర్స్ షోరూమ్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. చందన మోహన్‌రావు, మావూరి వెంకటరమణ, అల్లక సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బయట ఒక్క రూపాయి కూడా ..తక్కువ ధర ఉండదు : మావూరి వెంకటరమణ
60 ఏళ్ల క్రితం ప్రారంభమైన చందన బ్రదర్స్ దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. చందన మోహన్‌రావు, ఆయన సోదరులు కష్టపడి స్థాపించిన వ్యాపారా న్ని మేము కొనసాగిస్తున్నాం. మేము వీవర్స్ నుంచి నేరుగా కొనుగోలు చేస్తాం. దళారుల ప్రమేయం ఉండకపోవడంతో మాకు తక్కువ ధరలకు వస్త్రాలు వస్తా యి. దాంతో 20శాతం తక్కువ ధరలకు కొనుగోలుదారులకు విక్రయించగలుగుతున్నాము. ఽమా వద్ద కంటే బయట ఒక్క రూపాయి కూడా ధర తక్కువగా ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు ..చందన బ్రదర్స్ : అల్లక సత్యనారాయణ
చందన బ్రదర్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. హైదరాబాద్‌లో కాలు మోపిన వారు ఆటో ఎక్కి చందన బ్రదర్స్‌కు తీసుకెళ్లమని చెబితే చాలు.... ఇక్కడికి తీసుకొస్తారు. కస్టమర్లకు కొత్తదనం కోసం అద్భుతంగా తీర్చిదిద్దిన షోరూమ్‌ను ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం.