అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు : మాగంటి

ABN , First Publish Date - 2020-08-01T10:32:46+05:30 IST

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో వీడీసీసీ, సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు.

అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు : మాగంటి

కృష్ణానగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో వీడీసీసీ, సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. శుక్రవా రం బోరబండ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకోసం నగ ర డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సివరేజీ లైన్లు, మంచినీటి పైపులైన్లు, సీసీరోడ్లు, వీడీసీసీ రోడ్లకోసం బోరబండ డివిజన్‌లో పలు బస్తీల్లో కోటీ20 లక్షలతో పను లు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఏఈ జమీల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T10:32:46+05:30 IST