కరోనా తగ్గేనా?
ABN , First Publish Date - 2020-07-19T09:44:54+05:30 IST
గ్రేటర్‌లో కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. శనివారం 667 పాజిటివ్ కేసులు నమోదయ్యా..

- వణుకుతున్న గ్రేటర్‌వాసులు
- ఇప్పటికే పలువురికి వైరస్
సిటీన్యూస్ నెట్‌వర్క్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు. శనివారం 667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హయత్‌నగర్ సర్కిల్లో 72 పాజిటివ్ కేసులు
హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని ధనలక్ష్మి సొసైటీకి చెందిన ఓ వ్యక్తి, ఎస్‌కేడీనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, మరో వృద్ధురాలు, ఒక మహిళ, మన్సూరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి, బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన వృద్ధురాలు, సూర్యోదయకాలనీకి చెందిన మహిళ, నాగోల్ ప్రకృతినివా్‌సకు చెందిన వ్యక్తి, హయత్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి, మరో వృద్ధురాలు, చంద్రపురికాలనీ రోడ్ నంబర్-4కు చెందిన ఇద్దరు మహిళలు, సాయిసప్తగిరికాలనీకి చెందిన వృద్ధు డు, ఇంద్రప్రస్థ ఫేజ్-2కు చెందిన ఒకరు, వైదేహీనగర్‌కు చెందిన మహిళ, ఎన్‌జీఓ్‌సకాలనీకి చెందిన మహిళ, సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని కొత్తపేట మోహన్‌నగర్‌కు చెందిన ఇద్దరు యువకులు, ఒక మహిళ, సరూర్‌నగర్ సూర్యసరోజ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మహిళ, వికా్‌సనగర్‌కు చెం దిన వృద్ధుడు, న్యూమారుతీనగర్‌కు చెందిన ఒకరు, కొత్తపేటకు చెందిన యువకుడు, చైతన్యపురికి చెందిన ఒకరు, దిల్‌సుఖ్‌నగర్ ఈస్టర్న్ హోమ్స్‌కు చెందిన ఒక మహిళ, మరో వ్యక్తి, ద్వారకాపురంకాలనీకి చెందిన ఒకరు, పీఅండ్‌టీకాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, మరో వృద్ధురాలు, వికా్‌సనగర్‌కు చెందిన మరో వ్యక్తి, సెవెన్‌హిల్స్‌కాలనీకి చెందిన వ్యక్తి, మారుతీనగర్‌కు చెందిన యువకుడు, సరూర్‌నగర్‌కు చెందిన వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యక్తి, అంబేడ్కర్‌నగర్‌కాలనీకి చెందిన వ్యక్తి, మరో మహి ళ, సరూర్‌నగర్‌కు చెందిన యువకుడు, ఇద్దరు వ్యక్తులు, మరో మహిళ, బాలుడు, సిరినగర్‌కాలనీకి చెందిన ఒక వైద్యుడు, వాసవీకాలనీకి చెందిన వ్యక్తి, భవానీనగర్‌కు చెందిన వ్యక్తి, ప్రగతినగర్‌కు చెందిన వృద్ధుడు, ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం గోకుల్ ఎన్‌క్లేవ్‌కు చెందిన వ్యక్తి, అంజిరెడ్డినగర్‌కు చెందిన మరో వ్యక్తి, కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌కు చెందిన యువకుడు, విశ్వేశ్వరయ్యనగర్‌కు చెందిన వ్యక్తి, ద్వారకానగర్‌కు చెందిన బాలిక, వృద్ధురాలు, హస్తినాపురం ప్రాంతానికి చెందిన యువతి, వృద్ధుడు, మరో వ్యక్తి, ఎల్‌బీనగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో వృద్ధుడు, బాలుడు, నందనవనానికి చెందిన మరో వ్యక్తి, వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి, కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన బాలిక, మరో వ్యక్తి, మహిళ, భరత్‌నగర్‌కు చెందిన వ్యక్తి, కర్మన్‌ఘాట్ నిర్మలనగర్‌కు చెందిన వ్యక్తి, వనస్థలిపురం గణేష్ టెంపుల్ ప్రాం తానికి చెందిన మహిళ, ఎల్‌బీనగర్ ఎస్‌బీహెచ్‌కాలనీకి చెందిన వృద్ధుడు కరోనా బారిన పడ్డారు.
బడంగ్‌పేటలో ఇద్దరికి..
బడంగ్‌పేట్‌కు చెందిన ఒక మహిళ, మరో వ్యక్తి కరోనా బారిన పడ్డారు.
మలక్‌పేటలో 31..
జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్-6 పరిధిలోని పలు ప్రాంతాల్లో నివాసముంటున్న 31 మందికి శనివారం కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ జరిగింది. ముసారాంబాగ్‌లో ఇద్దరికి, శాలివాహననగర్ కాలనీలో ఐదుగురికి, శ్రీపురంకాలనీలో ఒకరికి, ఈస్ట్ ప్రశాంత్‌నగర్ కాలనీలో ఒకరికి, ఇంద్రానగర్‌లో ఒకరికి, మలక్‌పేటలో ముగ్గురికి, సైదాబాద్ మాధవనగర్‌లో ఒకరికి, అమీనాకాలనీలో ఒకరికి, గాంధీనగర్‌లో ఒకరికి, ఆజంపురలో ఇద్దరికి, కుర్మగూడలో ఒకరికి, నూర్‌ఖాన్‌బజార్‌లో ఒకరికి, సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలో ఒకరికి, సంతో్‌షనగర్‌లో పది మందికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో..
కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఏడుగురికి, మూసాపేట సర్కిల్ పరిధిలో 23 మందికి, కుత్బుల్లాపూర్ యూపీహెచ్‌సీలో 27 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి, గాజులరామారంలో 48 మందికి పరీక్షలు చేయగా 13మందికి, సూరారంలో 55 మందిలో ఐదుగురికి, షాపూర్‌నగర్‌లో 50మందిలో 19మందికి పాజిటివ్‌గా తేలింది.
చెస్ట్ ఆస్పత్రిలో..
ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో 91 కేసులకు, ఆయుర్వేద ఆస్పత్రిలో 105 పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 280మంది నమూనాలు సేకరించారు.
యూసు్‌ఫగూడ డివిజన్‌లో 13, బోరబండలో 9, ఎర్రగడ్డలో 9, రహ్మత్‌నగర్‌లో 11, వెంగళరావునగర్‌లో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్ డివిజన్‌లో 18, సోమాజిగూడలో 11, అమీర్‌పేటలో 9, సనత్‌నగర్‌లో 9మందికి కరోనా సోకింది.
తాజాగా 698 మందికి వైరస్
ఫ డీఎంఅండ్‌హెచ్ పరిధిలోని 97 యూపీహెచ్‌సీ ల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేశారు. శనివారం 4,134 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా 698 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధ్దారణ అయింది. ఇప్ప టిదాకా హైదరాబాద్ జిల్లాలో 25,069 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 4,168 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఒకరి మృతి
మల్కాజిగిరి పీవీఎన్ కాలనీకి చెందిన కిరాణా దుకాణ యజమాని(51) కరోనాతో మృతి చెందాడు.
కట్టడి ప్రాంతాల పరిశీలన
రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పరిధిలోని కరోనా కట్టడి ప్రాంతాలను కొవిడ్-19 స్పెషలాఫీసర్ సంతోష్ బడావత్ పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ డి.ప్రదీ్‌పకుమార్, ఏఈ ప్రశాంత్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.అశోక్ యాదవ్ ఉన్నారు.
కాప్రా సర్కిల్‌లో 132 మందికి చికిత్స
రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వృద్ధదంపతులతోపాటు ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కాప్రా శ్రీరాంనగర్ కాలనీలో ఒకరికి, పద్మారావునగర్‌లో ఒకరికి, సాకేత్‌కాలనీ ఫేజ్-3లో ఒకరికి, ఏఎ్‌సరావుననగర్ ఏపీఐఐసీ కాలనీలో ఇద్దరికి, బృందావన్ కాలనీలో ఒకరికి, నార్త్ కమలానగర్‌లో ఒకరికి, పరిమళనగర్‌లో ఒకరికి, న్యూ శ్రీనివాసనగర్ కాలనీలో ఒకరికి, కుషాయిగూడలో ఒకరికి, చక్రిపురంలో ఇద్దరికి, చర్లపల్లి సిల్వర్‌ఓక్‌లో ఆరుగురికి, హెచ్‌బీకాలనీ తిరుమలనగర్‌లో నలుగురికి, కైలాసగిరిలో ఒకరికి, నాచారంలో మహిళకు, ఇందిరానగర్‌లో వృద్ధుడు, కార్తికేయనగర్‌లో ఒకరికి కరోనా సోకింది. ఇప్పటిదాకా సర్కిల్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య 250కి చేరింది. ఇందులో 112మంది కోలుకోగా ఆరుగురు మృతిచెందారు. 132మంది చికిత్స పొందుతున్నారు.