జాగ్రత్తలతోనే కరోనా నియంత్రణ
ABN , First Publish Date - 2020-08-16T09:33:00+05:30 IST
కరోనా మహమ్మారి ప్రజలను వదిలిపెట్టడం లేదు. రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

సిటీన్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ప్రజలను వదిలిపెట్టడం లేదు. రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారం పలు యూపీహెచ్‌సీల్లో, మొబైల్ వాహనం ద్వారా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పలువురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అవగాహన, జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని సాహెబ్‌నగర్ బ్యాంక్‌కాలనీ, బండ్లగూడ అజయ్‌నగర్‌కాలనీ, ఆర్టీసీకాలనీ అన్మగల్, రాక్‌టౌన్ కాలనీ, మన్సూరాబాద్ సాయి సప్తగిరి కాలనీ ప్రాంతాల్లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు.
ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని కర్మన్‌ఘాట్ శుభోదయకాలనీ, వనస్థలిపురం ప్రశాంత్‌నగర్, లింగోజిగూడ టీఎన్‌ఆర్ శకుంతల అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని సూర్యసరోజ్ అపార్ట్‌మెంట్స్ కొత్తపేట్, న్యూమారుతీనగర్, మారుతీనగర్, కొత్తపేట ఓల్డ్ విలేజ్, అల్కాపురి ప్రాంతాల్లో ఏడుగురు కరోనా బారిన పడ్డారు.
జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్-6 పరిధిలో 55 మందికి కరోనా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌గా నమోదయింది. గడ్డిఅన్నారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురికి, జాంబాగ్ పార్క్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మందికి నెగెటివ్‌గా తేలింది. మలక్‌పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మందిలో ఒకరికి, మాదన్నపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 మందిలో నలుగురికి, శాలివాహననగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మందిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి, హసన్‌నగర్, మైలార్‌దేవుపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లలో 20 మందికి నెగిటివ్‌గా వచ్చిందని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన తెలిపారు.
పాతబస్తీలోని పంజేషా-1, 2లతో పాటు ఈదీబజార్ అమాన్‌నగర్‌లలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 20 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని వైద్యులు తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని యూపీహెచ్‌సీల్లో 29 మంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. బైబిల్‌హౌస్ యూపీహెచ్‌సీలో ముగ్గురికి, ముషీరాబాద్ యూపీహెచ్‌సీలో 11మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.