కేన్సర్‌ ఔషధాలంటూ మోసం

ABN , First Publish Date - 2020-03-21T09:57:50+05:30 IST

రెండో పెళ్లి చేసుకుంటానని, మ్యాట్రిమోనియల్‌ సైట్లో నకిలీ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసి, నగరానికి చెందిన మహి ళా డాక్టర్‌ను బురిడీ కొట్టించి, ఆమె నుంచి రూ.12.45 ల క్షలు దోచేసిన నైజీరియన్‌ ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిం దే.

కేన్సర్‌ ఔషధాలంటూ మోసం

మరో రూ.40 లక్షలు దోచేసిన నైజీరియన్‌ ముఠా

పోలీసు విచారణలో వెల్లడి

ఇసాక్‌ ఓలూను కస్టడీకి తీసుకున్న సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు

ప్రధాన నిందితుడి కోసం వేట 


హైదరాబాద్‌ సిటీ, మార్చి20 (ఆంధ్రజ్యోతి): రెండో పెళ్లి చేసుకుంటానని, మ్యాట్రిమోనియల్‌ సైట్లో నకిలీ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసి, నగరానికి చెందిన మహి ళా డాక్టర్‌ను బురిడీ కొట్టించి, ఆమె నుంచి రూ.12.45 ల క్షలు దోచేసిన నైజీరియన్‌ ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిం దే. వారిలో ప్రధాన నిందితుడు ఎస్లూ ఒడో పరారీలో ఉండగా.. మరో నైజీరియన్‌ గిడ్డీ ఇసాక్‌ ఓలూ, వారికి సహకరించిన నేపాల్‌ దేశస్థులు సాగర్‌ శర్మ, సుధీప్‌గిరి అలియాస్‌ అనిల్‌ కుమార్‌, బికా్‌సలను ఈ నెల-11న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు ఒడోను పట్టుకోవడానికి, ఇప్పటి వరకు చేసిన మరిన్ని సైబర్‌ నేరాల గురించి తెలుసుకోవడానికి గిడ్డీ ఇసాక్‌ ఓలూను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్‌ క్రైం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో ఆరు రోజుల పాటు ఇసాక్‌ను పోలీస్‌ కస్టడీకి అనుమతించారు. అనంతరం ఇసాక్‌ను పోలీసులు విచారించగా మరో ఘరానా సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఇద్దరిని బిజినెస్‌ పేరుతో నమ్మించి రూ.40 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఠా ప్రధాన నిందితుడు ఎస్లూ ఒడో ఫేస్‌బుక్‌లో కేరళకు చెందిన ఇద్దరు వ్య క్తులను పరిచయం చేసుకున్నాడు.


కొద్దిరోజులు స్నేహం పెంచుకున్న తర్వాత ఇండియాలో అ రుదుగా దొరికే ఒక రకం ఔషధ గింజలకు అమెరికాలో మంచి డిమాండ్‌ ఉందని నమ్మించాడు. వాటిని కేన్సర్‌ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వాటిని కొనుగో లు చేసి సరఫరా చేస్తే కొద్ది రోజుల్లోనే రూ.లక్షల్లో సం పాదించవచ్చని బురిడీ కొట్టించాడు. ఆ గింజలు ఎక్కడ, ఎవరి వద్ద దొరుకుతాయో చెప్పాడు. వాటిని పార్శిల్‌ ద్వారానే తెప్పించుకోవాలని సలహా ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన ఆ ఇద్దరు వ్యక్తులు సైబర్‌ కేటుగాళ్లు చెప్పిన విధంగా ఫోన్‌ చేసి రూ.లక్షలు చెల్లిం చి గింజలను తెప్పించారు.


వాటిని సైబర్‌ నే రగాళ్లు చెప్పిన అడ్ర్‌సకు పంపారు. పార్శిల్‌ అందిందని ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఔ షధ గింజలు ఇవేనని, వాటిని ఎక్కువ మొ త్తంలో కొనుగోలు చేసి వాటిని అమెరికాలో పలానా చిరునామాలకు పంపాలని చెప్పా రు. అవి అందిన వెంటనే రూ.లక్షల్లో డబ్బు తమ ఖాతాలో జమ అవుతుందని నమ్మించారు. అలా రూ.40 లక్షల విలువైన ఔషధ గింజల కోసం వారు ఆన్‌లైన్‌లో డబ్బులు చె ల్లించారు. అలా రూ.40 లక్షలు కొట్టేసిన నైజీరియన్‌ ముఠా ఫోన్‌లు స్విచాఫ్‌ చేసినట్లు పోలీసుల విచారణ లో తేలింది. అనధికారికంగా ఇండియాలో ఉండటమే కాకుండా పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్న ప్ర ధాన నిందితుడు ఎస్లూ ఒడోను పట్టుకోవడానికి మరోసారి పోలీసులు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఎస్లూ ఒడో, గిడ్డీ ఇసాక్‌ ఓలూ బిజినెస్‌ వీసాపై 2018 లో ఇండియాకు వచ్చి అనేక రకాల సైబర్‌ నేరాలు చే స్తూ రూ.లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-21T09:57:50+05:30 IST