ఉస్మానియా ఐవీ స్టాండ్లపై ప్రచారం
ABN , First Publish Date - 2020-08-16T09:39:46+05:30 IST
ఉస్మానియా ఆస్పత్రికి ఏదో ఒక సమస్య వెంటా డుతూనే ఉంది. ఆస్పత్రిలో సరైన సదుపాయాల్లేక రోగులు ఇబ్బందులకు

కర్రలకు ఫ్లూయిడ్ బాటిల్స్ అంటూ వీడియోలుఫ అది బోగస్ అన్న సూపరింటెండెంట్
మంగళ్‌హాట్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ఉస్మానియా ఆస్పత్రికి ఏదో ఒక సమస్య వెంటా డుతూనే ఉంది. ఆస్పత్రిలో సరైన సదుపాయాల్లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారనే ఫిర్యాదు లు తరచూ అనేకం వినిపిస్తుంటాయి. తాజాగా ఆస్పత్రిలో ఐవీ ఫ్లూయిడ్స్ స్టాండ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కర్రలను ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారనే ఆరోపణలు చోటుచేసు కున్నాయి. ఈ మేరకు ఓ వీడియో ట్విటర్‌లో వైర ల్ అయింది. సోషల్ మీడియాలో ప్రచారం కావ డంతో చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో ఐవీ ఫ్లూయుడ్స్ అవసరమైన ప్రతి పడకకు ఇదే విధం గా ఏర్పాటుచేసి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.
ఉస్మానియా ఆస్పత్రిలోని పాతభవనం శిథిలం కావడంతో దానిని సీజ్ చేశారు. దీంతో అక్కడ ఉన్న పడకలను ఇతర వార్డులకు సర్దుబాటు చేశారు. అందులో భాగంగా కులీకుతుబ్‌షా భవ నంపై వంద పడకలను ఏర్పాటు చేశారు. అయి తే అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ స్టాండ్స్ అందుబాటులో లేవని కర్రలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులు చోటుచేసుకున్నాయి. కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ బాటిళ్లను వేలాడుదీస్తున్నప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
తప్పుడు ప్రచారం-పోలీసులకు ఫిర్యాదు : ఆస్పత్రి సూపరింటెండెంట్
ఉస్మానియా ఆస్పత్రిలో ఐవీ స్టాండ్స్ లేవంటూ తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ నాగేంద్ర హెచ్చరించారు. ఆస్పత్రిలో సెలైన్ బాటిల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఐవీ స్టాండ్స్ పాతభవనంలో 300 ఉన్నాయని తెలిపారు. కావాలనే కొంతమంది మంచానికి కట్టె లు కట్టి సెలైన్ బాటిల్ వేలాడదీశారని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్ట డంతోపాటు వీడియోలు తీసి సోషల్ మీడి యా లో పోస్ట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.