చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం : ఈటల
ABN , First Publish Date - 2020-12-30T06:29:05+05:30 IST
చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం వస్తుందని, అలాంటి దగ్గర మానవత్వం ఉండదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజం ఆకలి భరిస్తుంది కానీ, ఆత్మగౌరవం కోల్పోదని, అంతరాలు లేని సమాజమే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు.

అప్జల్‌గంజ్,
డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): చైతన్యం లేని సమాజంలో ఉన్మాదం వస్తుందని,
అలాంటి దగ్గర మానవత్వం ఉండదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజం
ఆకలి భరిస్తుంది కానీ, ఆత్మగౌరవం కోల్పోదని, అంతరాలు లేని సమాజమే రాజ్యాంగ
లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత
పరిషత్ ఆడిటోరియంలో నాయీ బ్రాహ్మణ స్టూడెంట్ ఫెడరేషన్ 5వ వార్షికోత్సవ
సభ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
మాట్లాడుతూ.. రాజ్యాధికారం దిశగా నాయీ బ్రాహ్మణ విద్యార్థి ఫెడరేషన్ కృషి
చేయాలన్నారు. అనంతరం టీఎ్‌సఎఫ్ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కృష్ణమోహన్, సభాధ్యక్షుడు
డాక్టర్ రాపోలు సుదర్శన్, మానవ హక్కుల వేదిక కార్యదర్శి ఉప్పల బాలరాజు,
ఆయూష్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సారంగపాణి,
నాయీబ్రాహ్మణ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు తిమ్మనగరం వెంకట్,
వర్కింగ్ ప్రెసిడెంట్ రాంబాబు పాల్గొన్నారు.