రెండో అంతస్థులోని గదిలో చదువుకుంటున్న కూతురు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2020-10-13T18:16:47+05:30 IST

సీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్‌ లక్ష్మమ్మ పార్కు వద్ద నివసిస్తున్న ఉత్తమ్‌చంద్‌ జైన్‌ కుమార్తె స్వప్న జైన్‌(24) మూడోసారి

రెండో అంతస్థులోని గదిలో చదువుకుంటున్న కూతురు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

సీఏ విద్యార్థిని ఆత్మహత్య 


రాంనగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సీఏ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్‌ లక్ష్మమ్మ పార్కు వద్ద నివసిస్తున్న ఉత్తమ్‌చంద్‌ జైన్‌ కుమార్తె స్వప్న జైన్‌(24) మూడోసారి చార్టెడ్‌ ఆకౌంట్‌(సీఏ) పరీక్షలకు సిద్ధమవుతోంది. కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో ఉంటుండగా స్వప్న జైన్‌ రెండో అంతస్తులోని ప్రత్యేక గదిలో ఎక్కువ సమయం గడుపుతూ చదువుకుంటుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఆదివారం సాయంత్రం ఉత్తమ్‌చంద్‌ జైన్‌ తలుపులు కొట్టినా తీయలేదు. తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని చనిపోయి ఉంది. 


పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్వప్న జైన్‌ ఇంతకు ముందు సీఏ పరీక్షలు రెండుసార్లు రాసింది. క్వాలీఫై కాకపోవడం, నవంబర్‌లో జరిగే పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ కాకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తండ్రి ఉత్తమ్‌చంద్‌ జైన్‌ ముషీరాబాద్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలేంటని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-13T18:16:47+05:30 IST