7801 వజ్రాలను పొదిగిన ‘బ్రహ్మ వజ్ర కమలం ఉంగరం’.. మీరూ సొంతం చేసుకోవచ్చు..!

ABN , First Publish Date - 2020-11-03T15:45:49+05:30 IST

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన సంగతి విదితమే. 7,801 సహజమైన వజ్రాలను పొదిగిన బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో వేలం వేయబోతున్నారు. రిజర్వ్‌ ధర 78,01,000 రూపాయలు (దాదాపు 1,04,692

7801 వజ్రాలను పొదిగిన ‘బ్రహ్మ వజ్ర కమలం ఉంగరం’.. మీరూ సొంతం చేసుకోవచ్చు..!

బ్రహ్మ వజ్ర కమలం వేలం


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన సంగతి విదితమే. 7,801 సహజమైన వజ్రాలను పొదిగిన బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో వేలం వేయబోతున్నారు. రిజర్వ్‌ ధర 78,01,000 రూపాయలు (దాదాపు 1,04,692 యూఎస్‌ డాలర్లు)గా బిడ్డర్ల కోసం నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వరకూ ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. బిడ్డింగ్‌ వేయాలనుకునే వారి కోసం రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. వేలంలో పాల్గొనదలిచిన వారు www.thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాలలో 10శాతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించనున్నట్లు ఆ వ్యాపారి తెలిపారు.

Updated Date - 2020-11-03T15:45:49+05:30 IST