అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ప్రణాళిక?

ABN , First Publish Date - 2020-10-13T15:34:38+05:30 IST

తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ప్రణాళిక?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎంఐఎం‌ కోసమే జీహెచ్ఎంసీ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని కమలం పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడి యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.


ఈరోజు ఉదయం 11:30గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈరోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నాలుగు సవరణ బిల్లులపై  చర్చలు జరుపనున్నారు. 

Updated Date - 2020-10-13T15:34:38+05:30 IST