వీర జవాన్లకు నివాళిగా బీజేపీ ర్యాలీ

ABN , First Publish Date - 2020-06-22T10:10:03+05:30 IST

చైనాకు భారత సైన్యం ధీటైన సమాధానం చెబుతుందని బీజేపీ నాయకుడు పల్లపు గోవర్ధన్‌ అన్నారు

వీర జవాన్లకు నివాళిగా బీజేపీ ర్యాలీ

బంజారాహిల్స్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): చైనాకు భారత సైన్యం ధీటైన సమాధానం చెబుతుందని బీజేపీ నాయకుడు పల్లపు గోవర్ధన్‌ అన్నారు. భారత్‌-చైనా సరిహద్దులో గాల్వన్‌ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు నివాళిగా ఆది వారం ఫిలింనగర్‌ శంకర్‌ విల్లాస్‌ నుంచి హౌసింగ్‌ సొసైటీ వరకు సుమారు 250 మందితో భౌతికదూరం పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌ అనుకూలంగా నినాదాలు చేశారు. అనంత రం పల్లపు గోవర్ధన్‌ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పిచ్చిన వీర జవాన్ల ఆత్మ శాంతి చేకూరేలా మోదీ ప్రభుత్వం చైనాపై తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. శాంతి ని కోరుకునే భారత్‌ను రెచ్చగొడితే వచ్చే దుష్పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటా యో ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలందరూ సంఘటితమై జవాన్లకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, బన్నప్ప, గంగవరపు సుధాకర్‌రెడ్డి, ఆకుల రాజు, మిక్కి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-22T10:10:03+05:30 IST