‘మీ దిక్కుమాలిన ప్రగతిభవన్ తప్ప... నేను ఎక్కడికైనా పోవచ్చు కదా?’

ABN , First Publish Date - 2020-10-27T19:37:48+05:30 IST

బీజేపీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని కడిగిపారేయడంలో దిట్ట. అధికార పక్షాన్ని తన మాటలతో ఇరకాటంలో పెడుతుంటారు.

‘మీ దిక్కుమాలిన ప్రగతిభవన్ తప్ప... నేను ఎక్కడికైనా పోవచ్చు కదా?’

హైదరాబాద్: బీజేపీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని కడిగిపారేయడంలో దిట్ట. అధికార పక్షాన్ని తన మాటలతో ఇరకాటంలో పెడుతుంటారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నగరంలో ఉన్న ఆయనను హౌజ్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఆ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. 


‘‘కేసీఆర్ పర్సనల్ అకౌంట్ నుంచి మీకు జీతాలు ఇస్తున్నాడా? పొద్దున లేవగానే.. మీ వాళ్లు ఎందుకు వచ్చారు? ప్రగతిభవన్ ముట్టడా.. ఎవరిచ్చారు పిలుపు? మీవోడు ఉన్నాడా.. ఫామ్ హౌజ్‌లో ఉన్నాడా? హౌజ్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఆర్డర్ ఉందా మీ దగ్గర... ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఏ ఆర్డర్ తో పంపించారు? నేను ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా? మీ దిక్కుమాలిన ప్రగతిభవన్ తప్ప... నేను ఎక్కడికైనా పోవచ్చు కదా? నేను ఎక్కడికి పోవాలో మీరు చెబుతారా? నేను ఎక్కడికైనా పోతా... మరి ఎందుకు పంపించారు? నేను ఉండే రెండిళ్లకు పంపారు. నేను ఇక్కడే ఉంటా...’’ అంటూ పోలీసు అధికారులకు చెమటలు పట్టించారు. 

Updated Date - 2020-10-27T19:37:48+05:30 IST