బాలాజీనగర్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం
ABN , First Publish Date - 2020-11-27T18:23:39+05:30 IST
బాలాజీ నగర్ డివిజన్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

హైదరాబాద్: బాలాజీ నగర్ డివిజన్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో తమకు అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి చూపిస్తామని అన్నారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై వ్యాఖ్యలు చేసిన ఎంఐఎంపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. మతం పేరుతో రెచ్చగోట్టే వ్యాఖ్యలు ఎంఐఎం చేస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.