కాసేపట్లో పీవీ ఘాట్‌కు బండి సంజయ్
ABN , First Publish Date - 2020-11-26T14:38:42+05:30 IST
ఎంఐఎం, బీజేపీ నేతల పరస్పర వ్యాఖ్యలతో గ్రేటర్ పోరు హీటెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో పీవీ ఘాట్‌కు రానున్నా

హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీ నేతల పరస్పర వ్యాఖ్యలతో గ్రేటర్ పోరు హీటెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో పీవీ ఘాట్‌కు రానున్నారు. అయితే ఘాట్ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటామని ఘాట్ల వద్ద ప్రమాణం చేస్తానని బండి సంజయ్ చెబుతున్నారు. ఎంఐఎం నేత అక్భరుద్ధీన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఘాట్లను సందర్శించాలని బండి సంజయ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పీవీ ఘటా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.