బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ
ABN , First Publish Date - 2020-12-03T18:42:12+05:30 IST
: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. రేపు

హైదరాబాద్: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏజంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంజయ్ సూచనలు చేశారు. తెలంగాణ అవరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా సమావేశంలో నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 34,50.256 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటగా మెహదీపట్నం డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఫలితాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.