సీఎం కేసీఆర్, డీజీపీ ప్రకటనపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-11-27T19:37:44+05:30 IST

హైదరాబాద్‌: బీజేపీ నేతలు నేడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిశారు. శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్, డీజీపీ ప్రకటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

సీఎం కేసీఆర్, డీజీపీ ప్రకటనపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్‌: బీజేపీ నేతలు నేడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిశారు. శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్, డీజీపీ ప్రకటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే శాంతిభద్రతలు తెరపైకి తెచ్చారని.. బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కుట్రలను గవర్నర్‌కు వివరించామన్నారు. ఓటర్ల జాబితా నుంచి దొంగ ఓట్ల వరకూ టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. హైదరాబాద్‌లో అల్లర్లు జరగాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి.. ఎన్నికలు వాయిదా వేయాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. అమిత్ షా వస్తే.. టీఆర్ఎస్‌కు ఎందుకు భయమని ప్రశ్నించారు. ఓల్డ్‌సిటీలో మజ్లిస్ పార్టీని పేద ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Read more