బోరబండలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలి : బీజేపీ

ABN , First Publish Date - 2020-12-31T04:52:33+05:30 IST

బోరబండలో రహదారి వెడల్పు పనులు ప్రారంభించాలని బీజేపీ సెంట్రల్‌ జోన్‌ కమిటీ అధ్యక్షుడు గౌతంరావు డిమాండ్‌ చేశారు.

బోరబండలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలి : బీజేపీ
జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు

వెంగళరావునగర్‌, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): బోరబండలో రహదారి వెడల్పు పనులు ప్రారంభించాలని బీజేపీ సెంట్రల్‌ జోన్‌ కమిటీ అధ్యక్షుడు గౌతంరావు డిమాండ్‌ చేశారు. బుధవారం యూసు్‌ఫగూడ బస్తీలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. రహదారి వెడల్పు పనులను మధ్యలో నిలిపివేశారని, ఎన్‌ఆర్‌ఆర్‌ పురం సైట్‌- 2లో సమస్యలు నెలకొన్నాయని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివసించే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని డివిజన్లలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంభాల గంగరాజు, అట్లూరి రామకృష్ణ, శ్రీనివా్‌సగౌడ్‌, ప్రసన్నకుమారి, కొలను వెంకటేష్‌, సుప్రియగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలపై ఏఎంసీ నాగార్జునకు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-12-31T04:52:33+05:30 IST