గ్రేటర్‌పై కాషాయజెండా..!

ABN , First Publish Date - 2020-12-06T07:23:33+05:30 IST

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది.

గ్రేటర్‌పై కాషాయజెండా..!

19 నియోజకవర్గాల్లో బీజేపీ కార్పొరేటర్లు

11 చోట్ల కార్పొరేటర్లు లేని టీఆర్‌ఎస్‌

సిటింగ్‌ ఎమ్మెల్యేలున్న చోటా దక్కని ప్రాతినిధ్యం

ఎంఐఎంకూ 11 అసెంబ్లీల్లో లేని కార్పొరేటర్లు 

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. నగరానికి సంబంధించి పార్టీ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా 48 డివిజన్లలో గెలిచి రికార్డు సృష్టించింది. ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేకుండా నగరమంతా కాషాయ జెండా రెపరెపలాడింది. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న పాతబస్తీలోని పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గ్రేటర్‌ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా, 19 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ఒకరు, ఇద్దరు ఉండగా.. మరి కొన్ని నియోజకవర్గాల్లో క్లీన్‌ స్వీప్‌ చేశారు. కేవలం ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీకి కార్పొరేటర్లు లేరు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంకు 13 అసెంబ్లీల పరిధిలో ఒక్క కార్పొరేటర్‌ కూడా లేరు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెబుతోన్న బీజేపీ నగరమంతా విస్తరించగా, టీఆర్‌ఎస్‌ 11 నియోజకవర్గాలకు పరిమితమైంది. 2016లో అధికార పార్టీ కార్పొరేటర్లు 18 నియోజకవర్గాల్లో ఉండగా, ఇప్పుడు ఏడు తగ్గాయి. పాతబస్తీలోని ఐదు నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కార్వాన్‌, నాంపల్లి, బహదూర్‌పురాలో ఒక్కో స్థానం దక్కించుకోగా, యాకత్‌పురా, మలక్‌పేటలోని రెండు డివిజన్లలో విజయం సాధించింది. రాజేంద్రనగర్‌లో మూడు డివిజన్లు కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్న ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. గోషామహల్‌లో టీఆర్‌ఎ్‌సకు నాలుగు సిటింగ్‌ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలో చేరాయి. దీంతో ఈ నియోజకవర్గంలో కారుకు చోటు లేకుండా పోయింది. ముషీరాబాద్‌లోనూ ఐదు చోట్ల సిట్టింగ్‌లు ఓటమి పాలవడంతో టీఆర్‌ఎ్‌సకు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఒక్క డివిజన్‌ ఉన్న కంటోన్మెంట్‌నూ అధికార పార్టీ చేజార్చుకుంది. అదేసమయంలో టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలిచిన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపుర్‌లో ఒక్కో చోట బీజేపీ విజయం సాధించింది. అంబర్‌పేట-3, ఉప్పల్‌-2, మల్కాజ్‌గిరి-3, సనత్‌నగర్‌ - 2 స్థానాలు కాషాయ పార్టీ ఖాతాలో చేరాయి. 

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు లేని అసెంబ్లీ నియోజకవర్గాలు..

ఫ ఎల్‌బీనగర్‌ ఫ ముషీరాబాద్‌ ఫ గోషామహల్‌ ఫ మహేశ్వరం ఫ కంటోన్మెంట్‌ ఫ రాజేంద్రనగర్‌ ఫ నాంపల్లి ఫ చార్మినార్‌ ఫ యాకత్‌పురా ఫ బహదూర్‌పురా ఫ చాంద్రాయణగుట్ట ఫ మలక్‌పేట ఫ  కార్వాన్‌ 

బీజేపీ కార్పొరేటర్లు లేనివి.. 

ఫ సికింద్రాబాద్‌ ఫ జూబ్లీహిల్స్‌ ఫ పటాన్‌చెరు 

ఫ చాంద్రాయణగుట్ట ఫ చార్మినార్‌

ఎంఐఎం కార్పొరేటర్లు లేని నియోజకవర్గాలు..

ఫ ఖైరతాబాద్‌ ఫ సనత్‌నగర్‌ ఫ సికింద్రాబాద్‌ 

ఫ కూకట్‌పల్లి ఫ శేరిలింగంపల్లి ఫ కుత్బుల్లాపుర్‌ ఫ మల్కాజ్‌గిరి ఫ ఎల్‌బీనగర్‌ ఫ మహేశ్వరం 

ఫ అంబర్‌పేట ఫ పటాన్‌చెరు 

ఫ కంటోన్మెంట్‌ ఫ ఉప్పల్‌

Read more