కరోనాతో కష్టాలు.. లిఫ్ట్ ఇవ్వని వాహనదారులు
ABN , First Publish Date - 2020-07-08T18:42:20+05:30 IST
కరోనా ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. మహమ్మారి విజృంభణకు ముందు రోడ్డుపై వాహనదారులను లిఫ్ట్ అడిగితే ఇచ్చేవారు.

అల్వాల్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. మహమ్మారి విజృంభణకు ముందు రోడ్డుపై వాహనదారులను లిఫ్ట్ అడిగితే ఇచ్చేవారు. వైరస్ కారణంగా లిఫ్ట్ ఇవ్వాలంటే వాహనదారులు బయపడిపోతున్నారు. నగరంలో బస్సులు తిరగకపోవడం, మార్గమధ్యంలో వాహనాలు చెడిపోయినా, పెట్రోల్, డీజిల్ అయిపోయినా లిఫ్ట్ అడిగితే ఎవరూ ఇవ్వడం లేదు. లిఫ్ట్ ఇచ్చి ఎందుకు ఇబ్బందులు కొనితెచ్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇవ్వని పరిస్థితి నెలకొంది.
లిఫ్ట్ ఇవ్వాలంటే భయంగా ఉంది
కరోనా నేపథ్యంలో లిఫ్ట్ ఇవ్వాలంటే భయంగా ఉంది. గతంలో ద్విచక్రవాహనదారులు, కార్లలో వెళ్తున్న వారు లిఫ్ట్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. నేను కూడా గతంలో చాలాసార్లు లిఫ్ట్ ఇచ్చాను. ప్రస్తుతం ఎవరైనా లిఫ్ట్ అడిగితే వాహనాన్ని ఆపడం లేదు.
- ఉమాకాంత్(టింక్), జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి