15న మాల జన సమితి ఆవిర్భావ సభ

ABN , First Publish Date - 2020-03-04T08:12:10+05:30 IST

మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, సాధికారత కోసం మాల జన సమితి పనిచేస్తుందని సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాందాల భాస్కర్‌ అన్నారు.

15న మాల జన సమితి ఆవిర్భావ సభ

పంజాగుట్ట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, సాధికారత కోసం మాల జన సమితి పనిచేస్తుందని సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాందాల భాస్కర్‌ అన్నారు. 15న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో సమితి ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సభ పోస్టర్‌ను సమితి ఉపాధ్యక్షుడు విజయ్‌జోంద్‌లె, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్‌, పి. కిషోర్‌, మాదాసు రాహుల్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సమితి ప్రతినిధులు వెంకటేష్‌, పవన్‌, శశి, అరవింద్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-04T08:12:10+05:30 IST