పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పోటీలు

ABN , First Publish Date - 2020-12-15T05:58:21+05:30 IST

గీతా జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.బడేసాబ్‌ ఓ ప్రకటనలో

పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పోటీలు

అంబర్‌పేట: గీతా జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.బడేసాబ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నక్క వెంకటమ్మయాదవ్‌, నక్క యాదగిరి స్వామియాదవ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, తెలుగు భాషా చైతన్య సమితిల సంయుక్త ఆధ్వర్యంలో నర్సరీ నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. పోటీలలో పాల్గొనే వారు తమ పేర్లను 9948241188, 9160602662 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించి ఈ నెల 18 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనిన్నారు. విజేతలకు 10వేల నగదు బహుమతి అందిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-15T05:58:21+05:30 IST