భగవద్గీత తరగతులు: ఈ వారం రాజవిద్యా రాజగుహ్య యోగము

ABN , First Publish Date - 2020-11-06T21:35:32+05:30 IST

రామకృష్ణ మఠం ప్రతిశనివారం సాయంత్రం భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం భగవద్గీత 9వ అధ్యాయంలోని

భగవద్గీత తరగతులు: ఈ వారం రాజవిద్యా రాజగుహ్య యోగము

దోమలగూడ: రామకృష్ణ మఠం ప్రతిశనివారం సాయంత్రం భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం భగవద్గీత 9వ అధ్యాయంలోని ‘రాజ విద్యా రాజ గుహ్య యోగము’ వినిపించనున్నారు. స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో తరగతులు జరుగుతున్నాయి. ఆర్కే మఠ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ తరగతులను వినవచ్చు. 



ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.  మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-11-06T21:35:32+05:30 IST