29న బెస్ట్‌ ఐకానిక్‌ ఉమెన్‌ అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2020-03-13T09:54:06+05:30 IST

వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు ఈ నెల 29వ తేదీన బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణా హోటల్‌లో బెస్ట్‌ ఐకానిక్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది డికేడ్‌ అవార్డులను అందించనున్నట్లు నేచర్‌ కేర్‌ ఇన్నోవేషన్‌ సర్వీసెస్‌ అధినేత విజయ్‌రెడ్డి తెలిపారు.

29న బెస్ట్‌ ఐకానిక్‌ ఉమెన్‌ అవార్డుల ప్రదానం

ఖైరతాబాద్‌, మార్చి12 (ఆంధ్రజ్యోతి) : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలకు ఈ నెల 29వ తేదీన బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణా హోటల్‌లో బెస్ట్‌ ఐకానిక్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది డికేడ్‌ అవార్డులను అందించనున్నట్లు నేచర్‌ కేర్‌ ఇన్నోవేషన్‌ సర్వీసెస్‌ అధినేత విజయ్‌రెడ్డి తెలిపారు. ఈ అవార్డులకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం లక్డీకాపూల్‌లో ఐపీఎస్‌ స్వాతిలక్రా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా విజయ్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని, ఈ విషయమై ఐపీఎస్‌ స్వాతిలక్రా వివరాలు తెలుసుకుని అభినందించారని తెలిపారు. నాన్‌ ప్లాస్టిక్‌ వస్తువులను మార్కెట్‌లోకి ఎక్కువగా ఉత్పత్తి తీసుకురావడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలు రంగాల్లో కష్టపడి విజయం సాధించిన మహిళలకు బెస్ట్‌ ఐకానిక్‌ ఉమెన్‌ అవార్డులను అందజేస్తున్నామని ఆయన వివరించారు. పోస్టర్‌ ఆవిష్కరణలో ప్రతినిధులు నిహారిక, శివ, సరిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T09:54:06+05:30 IST