ముగిసిన విజిలెన్స్ వారోత్సవాలు
ABN , First Publish Date - 2020-11-03T09:31:16+05:30 IST
భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో వారం రోజులుగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ముగిశాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
అల్వాల్, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో వారం రోజులుగా నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ముగిశాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. బీడీఎల్ దేశ రక్షణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులతోపాటు, కరోనా నుంచి ప్రజల రక్షణ కోసం సంస్థ తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. బీడీఎల్ సీఎండీ సిద్దార్థ్ మిశ్ర సిబ్బందితో ఆన్‌లైన్(వర్చువల్)లో ప్రతిజ్ఞ చేయించారు. వారోత్సవాల్లో వెండర్స్‌తో ఆన్‌లైన్ మీటింగ్ కొత్తగా చేరిన ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సంస్థ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు, బానూరులోని డీఏవీ స్కూల్ విద్యార్థులకు విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యక్తిత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు మాడభూషి శ్రీధర్ బహుమతులు ప్రదానం చేశారు. బీడీఎల్‌లో విజిలెన్స్ విభాగం ప్రచురించిన వార్షిక వార్తాపత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీడీఎల్ డైరెక్టర్ దివాకర్, రాధాకృష్ణ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ఉపేందర్ వెన్నం, డైరెక్టర్ టెక్నికల్ దివాకర్, డైరెక్టర్ ప్రొడక్షన్ రాధాకృష్ణతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.