మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు
ABN , First Publish Date - 2020-11-13T09:09:13+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
మంత్రి ఈటల రాజేందర్
కుత్బుల్లాపూర్, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ డివిజన్ దత్తాత్రేయ నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కరుణతో కలిసి మంత్రి ప్రారంభించారు. బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, డీసీ మంగతాయారు, డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేఎం.గౌరీష్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్, డాక్టర్ వేణు మాధవి, డీపీఎంయూ మంజుల, నాయకులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో..
కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీకాలనీలో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాను మంత్రి సీహెచ్.మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం దవాఖానలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, అధికారులు వీరాంజనేయులు, డా.చందర్, వార్డు సభ్యులు హనుమంతరావు, హరిబాబు, భవాని, జ్యోతి, గఫూర్, ప్రతాప్, నారాయణరాజు పాల్గొన్నారు.
పాండురంగ నగర్‌లో....
అల్లాపూర్: మూపాపేట్ డివిజన్ మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి సీహెచ్.మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, మూసాపేట్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడు సత్యం పాల్గొన్నారు.