బక్రీద్‌ ఏర్పాట్లు..కరోనా నేపథ్యంలో జాగ్రత్తలపై..

ABN , First Publish Date - 2020-07-22T10:06:56+05:30 IST

బక్రీద్‌ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

బక్రీద్‌ ఏర్పాట్లు..కరోనా నేపథ్యంలో జాగ్రత్తలపై..

అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌


హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడు కమిషనరేట్లలోని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కో-ఆర్డినేషన్‌ మీటింగ్‌తోపాటు ఏర్పాట్ల గురించి చర్చించారు. బక్రీద్‌ సందర్భంగా ప్రతి ఏడాది శివారు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరంలోకి గొర్రెలు భారీగా సరఫరా అవుతుంటాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి ఉన్నతాధికారులతో సీపీ చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.


భౌతిక దూరం పాటించడంతోపాటు... తగిన జాగ్రత్తలతో పండగ చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, పోలీ్‌సస్టేషన్‌ స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌, లా అండ్‌ ఆర్డర్‌ అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌, ఎస్‌బీ జాయింట్‌ సీపీ తరుణ్‌జోషి, శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, ఎల్‌బీ నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఆర్టీఏ జేటీసీ జేపీ నాయక్‌, వెస్ట్‌జోన్‌ ఆర్టీఓ సీపీవీ రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-22T10:06:56+05:30 IST