అందుబాటులోకి మూసాపేట మెట్రో స్టేషన్
ABN , First Publish Date - 2020-10-08T08:36:22+05:30 IST
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనా కొన్ని మెట్రో స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు...

హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనా కొన్ని మెట్రో స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా కారిడార్-1లో మూసాపేటతోపాటు గాంఽధీ ఆస్పత్రి, యూసు్‌ఫగూడ మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. ఈనెల 7 నుంచి మూసాపేట మెట్రోస్టేషన్ నుంచి ప్రయాణికుల రాకపోకలకు అనుమతిచ్చినట్లు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు. స్టేషన్‌లో కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.