‘ఆంధ్రజ్యోతి బ్యూరోచీఫ్‌పై దాడి అమానుషం’
ABN , First Publish Date - 2020-03-25T08:44:06+05:30 IST
విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరోచీఫ్ మెండు శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేసిన అంబర్‌పేట పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి తెలంగాణ...

రాంనగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరోచీఫ్ మెండు శ్రీనివాస్ పై అకారణంగా దాడి చేసిన అంబర్‌పేట పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యులు, జర్నలిస్టులు విధులకు హాజరు కావచ్చని సీఎం కేసీఆర్ చెప్పిన్పటికీ పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన ఎస్‌ఐ లింగంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు రిపోర్టర్లపై కూడా పోలీసులు దాడి చేశారని అన్నారు.