మీర్‌చౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌

ABN , First Publish Date - 2020-06-16T09:58:07+05:30 IST

మీర్‌చౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.ఆనందర్‌ కిషోర్‌ను సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

మీర్‌చౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మీర్‌చౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.ఆనందర్‌ కిషోర్‌ను సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మెమో జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్పెక్టర్‌కు మెమో కాపీ అందజేసి, వెంటనే రిలీవ్‌ చేయాలని సౌత్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీపీని ఆదేశించారు.  ఇన్‌స్పెక్టర్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసిన వెంటనే సమాచారం అందించాలని సీఏఆర్‌ అదనపు డీసీపీని కోరినట్లు సీపీ వెల్లడించారు.

Updated Date - 2020-06-16T09:58:07+05:30 IST