ఏటీఎంలో చోరీకి యత్నించిన యువకుడి అరెస్ట్
ABN , First Publish Date - 2020-12-27T06:30:56+05:30 IST
ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ యువకుడ్ని ఛత్రినాక పోలీసులు 24 గంటలల్లోపునే గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చాంద్రాయణగుట్ట: ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ యువకుడ్ని ఛత్రినాక పోలీసులు 24 గంటలల్లోపునే గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ ఎం.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక కందికల్‌గేట్‌కు చెందిన ఆవుల సత్యనారాయణ కుమారుడు శివకృష్ణ (28) ఏటీఎంలలో డబ్బులు పెట్టే ఉద్యోగం చేస్తుంటాడు. ఈనెల 24వ తేదీన అర్థరాత్రి ముఖానికి మాస్క్, హెల్మెట్ ధరించి గౌలిపురాలోని హెచ్‌డీఎ్‌ఫసీ ఏటీఎంలోకి ప్రవేశించి తన వద్ద ఉన్న మాస్టర్ కీ తో ఏటీఎం మిషన్‌ను తెరిచాడు. ఇంతలో అలారం మోగడంతో శివకృష్ణ పారిపోయాడు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసు లు శివకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అం గీకరించాడు. దీంతో అతని నుంచి ఒక హీరోహోండా ప్యాషన్ ప్లస్ బైక్‌ను ఽస్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.