ఎల్బీ నగర్‌లో ఘనంగా వాజపేయి జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-12-25T19:40:19+05:30 IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 96వ జయంతి వేడుకలను లింగోజీగూడ డివిజన్ బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు.

ఎల్బీ నగర్‌లో ఘనంగా వాజపేయి జయంతి వేడుకలు

హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 96వ జయంతి వేడుకలను ఎల్బీ నగర్ నియోజకవర్గం బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీ నగర్ వార్డు ఆఫీసు దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాచమల్ల విజయ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్, చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధిలో వాజపేయి సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. 


రంగారెడ్డి జిల్లా నాయకులు కొత్త రవీందర్ గౌడ్, నియోజకవర్గ దళిత మోర్చా కన్వీనర్ గుండె కిరణ్ కుమార్, మాజీ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, సీనియర్ నాయకులు జిట్ట సురేందర్ రెడ్డి, తాటికొండ యాదయ్య, రాములు గౌడ్, రమేశ్ గుప్తా, డివిజన్ ప్రధాన కార్యదర్శి భాను శ్రీనివాస్, హరి ప్రసాద్, జగదీశ్, రిషి, వెంకటా చారి, రవీందర్ రెడ్డి, రాజేశ్, కిట్టు, వెంకటాచారి, శ్రీకాంత్, రాచమల్ల సురేశ్ తదితరులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-25T19:40:19+05:30 IST