కత్తి మహేష్ అరెస్టు అప్రజాస్వామికం
ABN , First Publish Date - 2020-08-20T09:59:58+05:30 IST
కత్తి మహేశ్ అరెస్టు అప్రజాస్వామికమని, రచయితలు, మేధావుల గొంతు నొక్కే క్రమంలో భాగంగానే కేంద్రం ఆదేశాల మేరకు

హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కత్తి మహేశ్ అరెస్టు అప్రజాస్వామికమని, రచయితలు, మేధావుల గొంతు నొక్కే క్రమంలో భాగంగానే కేంద్రం ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేశారని తెలుగు రాష్ట్రాల రచయితలు, మేధావులు ఆరోపించారు. జి. లక్ష్మీనరసయ్య, బండి నారాయణస్వామి, ఖాదర్ మొహియుద్దీన్, అల్లం రాజయ్య,అప్పుల నాయుడు అట్టాడా, శాంతి నారాయణ, వీఆర్ రాసాని, కాలువ మల్లయ్య తదితర రచయితలు, మేధావులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కత్తి మహేష్ అభిప్రాయాల్లోని సత్య, అసత్యాల్ని సరైన ఆధారాలతో చర్చల ద్వారా తేల్చుకోవాలన్నారు. భౌతికదాడులు చేసి బెదిరించి, పోలీస్ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తే అది ప్రజాస్వామ్యం కాదన్నారు. కత్తి మహే్‌షను విడుదల చేయాలని కోరారు.