ఎయిర్‌పోర్టులో యువకుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-07T09:13:15+05:30 IST

విమాన ప్రయాణికులను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయకుమార్‌ తెలిసిన వివరాల ప్రకారం..

ఎయిర్‌పోర్టులో యువకుడి అరెస్టు

శంషాబాద్‌రూరల్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): విమాన ప్రయాణికులను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయకుమార్‌ తెలిసిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన ఎంవీ దినే్‌షకుమార్‌(21) విమానాల్లో ప్రయాణికులతో మాటలు కలిపి తాను లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నానని, తన వద్ద డబ్బులు లేవని నమ్మించి డబ్బు లు వసూలు చేసేవాడు. కోయంబత్తూర్‌కు చెందిన సంజు అనే వ్యక్తి వద్ద  రూ.10 వేలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత పంపిస్తానన్నాడు. దినే్‌షకుమార్‌ డబ్బు పంపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సంజు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరు వెళ్తుండగా శుక్రవారం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దినే్‌షకుమార్‌ నుంచి నకిలీ ఐడీకార్డు, నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో జైలుకు వెళ్లి ఇటీవ ల బెయిల్‌పై విడుదలైనట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-11-07T09:13:15+05:30 IST