నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

ABN , First Publish Date - 2020-09-05T08:16:40+05:30 IST

మౌలాలి సబ్‌స్టేషన్‌ ఆర్టీసీ కాలనీ ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా జెడ్‌టీఎస్‌, తిరుమలనగర్‌, ఆర్టీసీ కాలనీ, డాక్టర్‌

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

కాప్రా, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): మౌలాలి సబ్‌స్టేషన్‌ ఆర్టీసీ కాలనీ ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా జెడ్‌టీఎస్‌, తిరుమలనగర్‌, ఆర్టీసీ కాలనీ, డాక్టర్‌ కృష్ణానగర్‌, హనుమాన్‌నగర్‌, కేసీఆర్‌ బస్తీ పరిసర ప్రాంతాల్లో ఉదయం శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నామని ఏఎ్‌సరావునగర్‌ ఏడీఈ ప్రసాదరావు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. 


అబ్దుల్లాపూర్‌మెట్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా శనివారం ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ, మైత్రీ గోకులం, లష్కర్‌గూడ, ఓఆర్‌ఆర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ను నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. 

Updated Date - 2020-09-05T08:16:40+05:30 IST