హైదరాబాద్‌లో మరో 1,422 కరోనా కేసులు.. ఏఏ ప్రాంతాల్లో నమోదయ్యాయంటే..

ABN , First Publish Date - 2020-07-08T16:00:51+05:30 IST

రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 1,422 మంది వైరస్‌ బారిన పడ్డారు.

హైదరాబాద్‌లో మరో 1,422 కరోనా కేసులు.. ఏఏ ప్రాంతాల్లో నమోదయ్యాయంటే..

మహమ్మారి విజృంభణ.. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు


హైదరాబాద్, సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌ (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 1,422 మంది వైరస్‌ బారిన పడ్డారు. 


మల్కాజిగిరి సర్కిల్‌ పదిమంది కరోనా బారినపడ్డారు. ఆనంద్‌బాగ్‌లో ఓ వ్యక్తి (35), బాల సరస్వతినగర్‌లో మహిళ (27), యాదవనగర్‌లో ఒకరు(49), కాకతీయనగర్‌లో వృద్ధుడు(63), సత్తిరెడ్డికాలనీలో వ్యక్తి (59), వినాయక్‌నగర్‌లో వృద్ధుడు (60), మౌలాలి సుధానగర్‌లో ఒకరు (49), హన్మాన్‌పేట్‌లో ఓ వ్యక్తి (40), సఫిల్‌గూడలో యువతి (21), విమలాదేవినగర్‌లో ఒకరు(44), మల్కాజిగిరి సర్కిల్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కుమ్మరి బస్తీకి చెందిన మహిళ(45)కు పాజిటివ్‌ వచ్చిందని నోడల్‌ అధికారి డాక్టర్‌ రెడ్డి కుమారి తెలిపారు.  


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. రాజేంద్రనగర్‌లో ముగ్గురు, శాస్త్రీపురంలో ముగ్గురు, హైదర్‌గూడలో ఆరుగురు, అత్తాపూర్‌లో ఆరుగురు, బుద్వేల్‌ భాగవతిగూడలో ఇద్దరు, మైలార్‌దేవుపల్లి లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 


ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో 38 పాజిటివ్‌, 74 అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 44 కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ పరమేశ్వర్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం 250 మంది నమూనాలను సేకరించామన్నారు. 


నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో మంగళవారం 73 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారందరినీ ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 


కూకట్‌పల్లి ప్రాంతంలో మంగళవారం 17 మందికి కరోనా సోకింది. మూసాపేట సర్కిల్‌ పరిధిలో 11, కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


యూసుఫ్ గూడ సర్కిల్‌-19 పరిధిలో మంగళవారం 33 కరోనా కేసులు నమోదయ్యాయి. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 17, బోరబండ డివిజన్‌లో 8,  ఎర్రగడ్డ డివిజన్‌లో 7, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో 7, వెంగళరావునగర్‌ డివిజన్‌లో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


కుత్బుల్లాపూర్‌లో మంగళవారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రశాంత్‌నగర్‌లో వృద్ధుడు, షాపూర్‌నగర్‌లో బాలుడు, జగద్గిరిగుట్టలో బాలిక, ఇద్దరు వ్యక్తులు, చింతల్‌లో మహిళ, ఓ వ్యక్తి, గణే్‌షనగర్‌లో ఒకరికి, సుభా్‌షనగర్‌లో మహిళ, నిజాంపేటలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.  


ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎనిమిదిమందికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పఠాన్‌ బస్తీలో ఓ మహిళ, వృద్ధురాలు, మొరంబొందలో బాలికకు, అంబేడ్కర్‌నగర్‌లో మహిళ, గంగపుత్ర కాలనీలో యువకుడు, మోహన్‌నగర్‌లో వృద్ధుడు, భోలక్‌పూర్‌లో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.   


హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని మన్సూరాబాద్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కాలనీలో వ్యక్తికి, హయత్‌నగర్‌ షిర్డీనగర్‌కు చెందిన మహిళ, ఎన్‌జీవో్‌సకాలనీలో ఒకే ఇంట్లో వృద్ధుడు, మహిళ, వనస్థలిపురం మెడికల్‌ హెల్త్‌కాలనీలో మహిళ, హయత్‌నగర్‌ శ్రీనివాసకాలనీలో ఒకరికి, మన్సూరాబాద్‌ బాలాజీనగర్‌లో ఒకే ఇంట్లో ఇరువురికి, వనస్థలిపురం సాయినాథ్‌కాలనీ ఒకే ఇంటో ఇరువురికి, నాగోల్‌ అరుణోదయనగర్‌లో కాలేజీ ప్రిన్సిపాల్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఉద్యోగి, బాలుడు, బాలిక, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని భాగ్యనగర్‌కాలనీలో  మహిళ, ద్వారకానగర్‌కాలనీలో ఇద్దరు వ్యక్తులు, ఎల్‌బీనగర్‌లో మహిళ, ఇద్దరు వ్యక్తులు, మైత్రిపురంలో ఒకరికి, కృష్ణానగర్‌లో మహిళ, కర్మన్‌ఘాట్‌లో ఇద్దరు, అభ్యుదయనగర్‌లో ఓ మహిళ, చంపాపేట మారుతీనగర్‌లో యువకుడు, వనస్థలిపురం సీటైప్‌ కాలనీలో ఒకరికి, వనస్థలిపురంలో ఒకరు, శాతవాహననగర్‌లో యువకుడు, అరుణోదయనగర్‌లో మహిళ, ఆర్‌కేపురం హరిపురం కాలనీలో వృద్ధుడు, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని సరూర్‌నగర్‌లో వృద్ధుడు, మంజీరా హైట్స్‌లో ఒకరు, దిల్‌సుఖ్‌నగర్‌ వికా్‌సనగర్‌లో వృద్ధుడు,  చైతన్యపురికి చెందిన మహిళ, సరూర్‌నగర్‌ రోడ్‌ నంబర్‌ 6లో ఉంటున్న ఇరువురు, మారుతీనగర్‌లో ఓ వ్యక్తి, కర్మన్‌ఘాట్‌లో వృద్ధుడు, కొత్తపేటలో మహిళ, భవానీనగర్‌లో యువతి, పీ అండ్‌ టీ కాలనీకి చెందిన యువతి, సరూర్‌నగర్‌ ఎస్‌వీఆర్‌ఎస్‌ బృందావన్‌కు చెందిన వ్యక్తి,  వెంకటేశ్వకాలనీలో ఒకరు, ద్వారకానివా్‌సకు చెందిన వ్యక్తి, గౌతమ్‌నగర్‌లో ఓ మహిళ, ఇద్దరు బాలురు, కోదండరాంనగర్‌లో ఓ వ్యక్తి, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిసౌధ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వృద్ధురాలు, మునిసిపల్‌ కాలనీలో ఓ మహిళ, దుర్గానగర్‌ కాలనీలో ఓ వ్యక్తి, న్యూ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు, హరిపురి కాలనీలో వృద్ధుడు,  కొత్తపేట న్యూమారుతీనగర్‌లో వృద్ధురాలు, డాక్టర్స్‌ కాలనీలో ఒకరు, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఇద్దరు, భాగ్యనగర్‌లో ఓ వ్యక్తి, దుర్గానగర్‌లో ఒకరు, కొత్తపేటలో మహిళ, భాగ్యనగర్‌ కాలనీలో ఒకరు, గడ్డిఅన్నారంలో ఓ మహిళ, కొత్తపేట ఫార్జున్‌ ఎన్‌క్లేవ్‌లో వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


బాలాపూర్‌ మండల పరిధిలోని మీర్‌పేట శివనగర్‌ హిల్స్‌లో ఒకే ఇంట్లో ఇరువురికి, బడంగ్‌పేట్‌ శివనారాయణపురంలో ఒకే ఇంట్లో ఉంటున్న ఇరువురికి, ఎర్రకుంటలో నివసిస్తున్న మహిళ, యువకుడు కరోనా బారినపడ్డారు. 


మలక్‌పేటలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న 45 మందికి కరోనా సోకింది. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. శాలివాహననగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 11, మలక్‌పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 16, ఆజంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 8, గడ్డిఅన్నారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముగ్గురు, మాదన్నపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏడుగురికి కరోనా సోకినట్లు వెల్లడైంది. 


పెద్దఅంబర్‌పేట మునిసిపాలిటీ పరిధిలో 24వ వార్డు ప్రజయ్‌ గుల్మోహర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి(56)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


రామంతాపూర్‌, హబ్సిగూడలో ఎనిమిదిమందికి కరోనా సోకింది. వీరిలో బాలిక, నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. 


చిక్కడపల్లి వివేక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి(48)కి కరోనా సోకింది.

Updated Date - 2020-07-08T16:00:51+05:30 IST