గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా

ABN , First Publish Date - 2020-12-10T23:35:48+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షునిగా ప్రమోషన్‌ కోసమే...

గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షునిగా ప్రమోషన్‌ కోసమే గ్రేటర్‌ పదవికి రాజీనామా చేసినట్లు అంజన్‌ కుమార్ చెప్పడం విశేషం. రాజకీయ జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని, బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనని అంజన్‌ కుమార్ యాదవ్ కుండబద్ధలు కొట్టారు.


అంజన్‌‌కుమార్‌‌ యాదవ్‌ అధిష్టానం వైఖరి పట్ల‌ అసంతృప్తితో ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్‌ అభ్యర్థులకు తనకు తెలియకుండా టికెట్లు ఇవ్వడం ఏమిటని అంజన్‌‌ కుమార్‌‌ అప్పట్లో అలకబూనినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మాజీ మేయర్‌‌ బండ కార్తీకరెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రవి కుమార్‌‌ యాదవ్‌‌ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-12-10T23:35:48+05:30 IST