‘టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలి’
ABN , First Publish Date - 2020-06-25T09:53:34+05:30 IST
ఎల్‌బీనగర్ ఈస్ట్ జోన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్

ఎల్‌బీనగర్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్ ఈస్ట్ జోన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకు లు ఆందోళన చేశారు. నాయకులు కొప్పుల నర్సింహారెడ్డి, దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో రూ. 5.20 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడంతో 20 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. వారిలో నలుగురు కాంట్రాక్టర్లు తక్కువకు టెండర్లు వేసేవారని, ఈ సారి 1 శాతం మాత్రమే వేశారన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ వ్యవహారం రావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు లేఖలు రాయడంతో అధికారులు ఆదరాబాదరాగా టెండర్లను రద్దు చేశారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.