బీజేపీ, టీఆర్ఎస్‌పై మనిక్కమ్ ఠాగూర్ తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2020-11-25T17:51:15+05:30 IST

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మనిక్కమ్ ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీజేపీ, టీఆర్ఎస్‌పై మనిక్కమ్ ఠాగూర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మనిక్కమ్ ఠాగూర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ మత పరంగా విభజించాలని చూస్తుందని....టీఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. తమ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి విజయం కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవినీతి పాలన పెచ్చుపెరిగిపోయిందని మండిపడ్డారు. మునిసిపల్ మంత్రి, ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ మతం, టీఆర్ఎస్ అవినీతితో కూడుకొని ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని అంటున్నారని తెలిపారు. ఐటీ, ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రతీ కేంద్ర మంత్రి రాష్టానికి వచ్చి టీఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్టు మాట్లాడుతున్నారని....  మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని చెడగొడుతున్నారని మనిక్కమ్ ఠాగూర్ ఆరోపించారు.

Updated Date - 2020-11-25T17:51:15+05:30 IST