అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలి : కరుణాకర్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-12-16T04:48:59+05:30 IST
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్
బర్కత్‌పుర: రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.