నేటి నుంచి అడ్వకేట్ల నిరాహారదీక్షలు : నాగేందర్‌

ABN , First Publish Date - 2020-05-11T09:11:32+05:30 IST

క్‌డౌన్‌ నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద న్యాయవాదులకు ఆర్థిక సాయం..

నేటి నుంచి అడ్వకేట్ల నిరాహారదీక్షలు : నాగేందర్‌

బర్కత్‌పుర, మే10 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన మార్గదర్శకాలలో ఏడేళ్లలోపు అనుభవం ఉండాలనే నిబంధనను తక్షణమే తొలగించాలని దక్షిణభారత అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ ఎస్‌.నాగేందర్‌ డిమాండ్‌ చేశారు. ఏడేళ్లలోపు అనుభవం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమ ఇళ్లలో నిరాహార దీక్షలు చేపట్టనున్నారని ఆదివారం నవ తెలంగాణ అడ్వకేట్స్‌ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

Updated Date - 2020-05-11T09:11:32+05:30 IST