జీవో నెం.2లో మరో ఏడు క్రీడలు చేర్చండి
ABN , First Publish Date - 2020-10-01T09:06:15+05:30 IST
సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో క్రీడాకారులకు జీవో నెం.2 ప్రకారం ఇస్తున్న స్పోర్ట్స్ కోటాలో మరికొన్ని క్రీడలను జత
హైదరాబాద్ (ఆం ధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో క్రీడాకారులకు జీవో నెం.2 ప్రకారం ఇస్తున్న స్పోర్ట్స్ కోటాలో మరికొన్ని క్రీడలను జత చేయాల్సిందిగా క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) విజ్ఞప్తి చేసింది. నెట్‌బాల్, టెన్నికాయిట్, బేస్‌బాల్, సెపక్‌తక్రా, ఉషు, క్యారమ్స్‌ను జీఓ నెంబర్ 2లోని 31 క్రీడల జాబితాలో చేర్చాల్సిందిగా టీఓఏ ప్రతినిధులు మంత్రిని కోరారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వచ్చే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఓఏ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్ ఉన్నారు.