నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనంపై చర్యలు
ABN , First Publish Date - 2020-09-03T10:17:40+05:30 IST
రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటు సరిగ్గా కనపడకుండా (చలానాలు ఎగ్గొట్టే ఉద్దేశంతో) ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఆపిన కూకట్‌పల్లి ట్రాఫిక్

హైదర్‌నగర్, సెప్టెంబర్ 2(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటు సరిగ్గా కనపడకుండా (చలానాలు ఎగ్గొట్టే ఉద్దేశంతో) ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఆపిన కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు సదరు టూ వీలర్ యజమానిపై చర్యలకు ఉపక్రమించారు. బుధవారం మధ్యాహ్నం జేఎన్‌టీయూ కూడలి వద్ద జరిగిన ఈ సంఘటనలో హోండా ఆక్టివా(టీఎ్‌స08జీడబ్ల్యూ9751) నంబరు కనపడని విధంగా ప్లేటు ఉండటాన్ని గమనించిన కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు వివరాలు ఆరా తీశారు. వాహన చోదకుడు బోరబండకు చెందిన వి.కిరణ్ పవన్ చలానాలను తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే అధికారుల ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఎస్‌ఐ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.