ఆటోడ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల యాసిడ్‌ దాడి

ABN , First Publish Date - 2020-09-16T17:32:36+05:30 IST

ఓ ఆటోడ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎర్రకుంటకు చెందిన అమ్జద్‌ఖాన్‌(47) స్థానికంగా ట్రేడర్స్‌ దుకాణం నిర్వహించే అబ్దుల్‌ రహమాన్‌ దగ్గర ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఆటోడ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల యాసిడ్‌ దాడి

పహడీషరీఫ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఓ ఆటోడ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎర్రకుంటకు చెందిన అమ్జద్‌ఖాన్‌(47) స్థానికంగా ట్రేడర్స్‌ దుకాణం నిర్వహించే అబ్దుల్‌ రహమాన్‌ దగ్గర ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దుకాణం పక్కన గల గల్లీలోకి అమ్జద్‌ఖాన్‌ను తీసుకెళ్లి ఆయన శరీరంపై యాసిడ్‌ పోశారు. దీంతో ఆ మంటలకు అతడు కేకలు వేయగా స్థానికులు గమనించి అబ్దుల్‌ రహమాన్‌కు తెలిపారు. అతడు అమ్జద్‌ఖాన్‌ కుటుంబసభ్యులకు, బాలాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ అమ్జద్‌ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అమ్జద్‌ఖాన్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. భార్యతో కూడా తరచూ గొడవ పడేవాడని పోలీసు విచారణలో తేలింది. ఘటనకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-16T17:32:36+05:30 IST